Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన ఐదు పక్కటెముకలు!

Husband tight hug breaks five ribs of wife in China
Advertisement
  • చైనాలో భర్త కౌగిలింతతో మహిళ పక్కటెముకలు ఫ్రాక్చర్
  • చలిగా ఉందని చెప్పడంతో గట్టిగా హగ్ చేసుకున్న భర్త 
  • ఆస్టియోపొరోసిస్ సమస్యే కారణమని తేల్చిన వైద్యులు
  • డైటింగ్, కాఫీ, బరువు తక్కువగా ఉండటం వంటివి కారణాలుగా వెల్లడి
  • చికిత్స అనంతరం మహిళ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్
Advertisement
చైనాలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. భర్త ప్రేమతో గట్టిగా కౌగిలించుకోవడంతో ఒక మహిళ ఏకంగా ఐదు పక్కటెముకలు విరిగి, మరొకటి పగిలిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

జియాంగ్సూ ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ అనే వ్యక్తి తన భార్యకు చలిగా ఉందని చెప్పడంతో ప్రేమగా దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో 'టక్' మని శబ్దం రావడంతో పాటు, ఆమెకు తీవ్రమైన నొప్పి మొదలైంది. వెంటనే ఆసుప‌త్రికి తరలించగా, సీటీ స్కాన్‌లో ఐదు పక్కటెముకలు విరిగినట్లు, మరొకటి పగిలినట్లు వైద్యులు నిర్ధారించారు. మామూలు శక్తితోనే కౌగిలించుకున్నానని, ఇలా జరుగుతుందని ఊహించలేదని భర్త వాంగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే, దీనికి అసలు కారణం ఆమెకు ఉన్న 'ఆస్టియోపొరోసిస్' అనే ఎముకల బలహీనత సమస్య అని వైద్యులు తేల్చారు. తన భార్య బరువు కేవలం 45-50 కిలోలు మాత్రమే ఉంటుందని, తరచూ రాత్రి భోజనం మానేయడం (డైటింగ్), రోజూ కాఫీ తాగడం, ఎండ తగలకపోవడం వంటి కారణాల వల్ల ఆమె ఎముకలు బలహీనపడి ఉంటాయని భర్త తెలిపాడు.

ఎముకలు బలహీనంగా ఉన్నవారిని అకస్మాత్తుగా గట్టిగా కౌగిలించుకుని పైకి ఎత్తినప్పుడు పక్కటెముకలపై తీవ్రమైన ఒత్తిడి పడి విరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళకు మందులు, ఆయింట్‌మెంట్లు ఇచ్చి విశ్రాంతి సూచించారు. సర్జరీ అవసరం లేదని చెప్పి, ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
Advertisement
Advertisement
Chinese woman
Broken ribs hug
Osteoporosis bone health
Jiangsu Province incident
Multiple rib fractures
Husband tight hug

More Telugu News